శ్రీవారి లడ్డూ తయారీపై సిట్ దర్యాప్తు
సీబీఐకి..సుప్రీంకోర్టుకు నివేదిక
తిరుమల – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కేసు. ఈ కేసుకు సంబంధించి ఏపీ కూటమి సర్కార్ విచారణకు ఆదేశించింది. ఈమేరకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇందులో భాగంగా సిట్ టీం రంగంలోకి దిగింది. దర్యాప్తు ప్రారంభించింది. మూడు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో లడ్డూ తయారీకి వస్తున్న పదార్థాలతో పాటు ప్రత్యేకించి నెయ్యిని పరిశీలించారు. నిన్న లడ్డూ , బూందీ పోటు, పిండి మర వద్ద ఉన్న ల్యాబ్ ను తనిఖీ చేశారు.
మొత్తం దర్యాప్తునకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సీబీఐ డైరెక్టర్ తో పాటు సుప్రీంకోర్టుకు అందజేయనుంది సిట్ బృందం. ఇదిలా ఉండగా ఇప్పటికే తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశాన్ని కుదిపేసింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు.
దీని వెనుక ఎవరు ఉన్నారనేది తేల్చాలని కోరారు. దీనిపై సీరియస్ గా స్పందించింది సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం . ఒక బాధ్యత కలిగిన సీఎం ఇలాంటి ప్రకటన ఎలా చేస్తారంటూ మండిపడింది. ఆరోపణలు చేసే ముందు ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొంది. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.