బాలీవుడ్ లో జనాదరణ కలిగిన నటుడు
ముంబై : బాలీవుడ్ లో అత్యంత జనాదరణ కలిగిన నటుడు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు డిసెంబర్ 27. తను 60 ఏళ్ల లోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్బంగా తన గురించి కొంత పరిచయం మాత్రమే. 1989లో ఎంట్రీ ఇచ్చాడు సినీ రంగంలోకి . విజయవంతమైన సినిమాలలో నటించాడు. తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం మోస్ట్ పవర్ ఫుల్ యాక్టర్ గా కొనసాగుతున్నాడు. తను ఇప్పటి వరకు 100కి పైగా సినిమాలలో నటించాడు. తను నటించిన మైనే ప్యార్ కియా మూవీ ఇండియాను షేక్ చేసింది. ఈ ఒక్క మూవీతో తను రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారి పోయాడు. ఈ సినిమాకు అస్సెట్ మ్యూజిక్ , సాంగ్స్. ప్రాణం పెట్టి పాడాడు దివంగత ఎస్పీ బాల సుబ్రమణ్యం. తన గొంతే సల్మాన్ ఖాన్ కు అస్సెట్ అయ్యింది. ఇదే రాజశ్రీ తీసిన హమ్ ఆప్ కే హై కౌన్ మూవీ దుమ్ము రేపింది. మ్యూజికల్ గా ఇది కూడా బిగ్ హిట్. సాంప్రదాయ విలువలను పెంపొందించేలా తీశాడు దర్శకుడు సూరచంద్ బరజాత్యా.
ఈ ఏడాది 2025లో నటించాడు సికందర్. ఇది ఆశించిన మేర ఆడలేదు. మైనే ప్యార్ కియాతో పాటు తేరే నామ్,, సుల్తాన్ , బజరంగీ భాయిజాన్ సినిమాలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. షారుక్ ఖాన్ తో కరణ్ అర్జున్ , హమ్ తుమ్హారే హై సనమ్, అమీర్ ఖాన్ తో అందాజ్ అప్నా అప్నా , అక్షయ్ కుమార్ తో ముజ్ సే షాదీ కరోగీ మూవీలలో కలిసి నటించాడు. వీరితో పాటు అనిల్ కపూర్, సంజయ్ దత్, సన్నీ డియోల్, జాకీ ష్రాఫ్, గోవింద , సైఫ్ అలీ ఖాన్ వంటి 1990ల నాటి తారలతో తరచుగా కలిసి పనిచేశాడు. ప్రముఖ నటీమణులైన మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, రాణీ ముఖర్జీ, ప్రీతి జింటా, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, దీపికా పదుకొణె, అనుష్క శర్మ, కరీనా కపూర్ ఖాన్, ప్రియాంక చోప్రా జోనాస్ , జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రష్మిక మందన్నాతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆయుష్ శర్మ, దిశా పటాని, పూజా హెగ్డే, రణదీప్ హుడా, ఇమ్రాన్ హష్మీ లతో కలిసి నటించడం విశేషం. తన తండ్రి ఫేమస్ రైటర్ సలీంఖాన్ , తల్లి సల్మాఖాన్ చిత్ర నిర్మాత.






