ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం గొప్పది
తిరుపతి : ఏపీలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేపడుతున్నాం అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. క్వాంటం, ఏఐ వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఏపీ నుంచి క్వాంటం కంప్యూటర్ ఆపరేట్ చేయబోతున్నాం అన్నారు. టెలికాం సంస్కరణలతో కనెక్టివిటీ పెరిగిందని చెప్పారు. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎయిరో స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్ టెక్ పార్క్ వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. గూగుల్ పెద్ద ఎత్తున పెట్టుబడులు విశాఖలో పెట్టబోతోందని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు. అలాగే ఇంకా చాలా కంపెనీలు ఏపీకి రాబోతున్నాయని చెప్పారు. ప్రాంతాల వారీగా ఏయే రంగాల్లో అభివృద్ధి చేయవచ్చో ప్రణాళికలు వేసుకుని రూపొందించాం అన్నారు. ఈ సందర్భంగా ఇండియాస్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.
ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. ఆయన దేశాన్ని నెంబర్ వన్ గా తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. నెంబర్-1 స్థానంలోకి వెళ్లనున్న సందర్భంలోనే పేద-ధనిక మధ్య అంతరాలు తగ్గే వ్యవస్థను రూపొందించు కోవాల్సిన అవసరం ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు. గంగా-కావేరీ నదుల అనుసంధానం అనేది జరగాలన్నారు. అప్పుడు నీటి భద్రత కలుగుతుందని అన్నారు. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో భారత దేశం ఛాంపియన్ గా ఉండ బోతోందన్నారు. దేశాభివృద్ధికి వాజ్ పేయి పునాదులు వేశారని కొనియాడారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారంటూ కితాబు ఇచ్ఆరు. వినూత్న ఆలోచనలు చేయాలి… కొత్త ఆవిష్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు.






