NEWSANDHRA PRADESH

వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కీల‌క భేటీ

Share it with your family & friends

పార్టీ మారే యోచ‌న‌లో ఎమ్మెల్యే
అమ‌రావ‌తి – ఏపీ వైసీపీలో మ‌రో వికెట్ ప‌డ‌నుందా. అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఆ పార్టీకి చెందిన మైల‌వ‌రం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ పార్టీ మారుతున్నార‌నే ప్ర‌చారం జోరందుకుంది.

ఆదివారం ఎమ్మెల్యే ముఖ్య నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. ఈ కీల‌క భేటీలో నియోజ‌క‌వ‌ర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలతో ఐత‌వ‌రంలోని త‌న నివాసంలో చ‌ర్చ‌లు జ‌రిపారు వ‌సంత కృష్ణ ప్ర‌సాద్. ఇదిలా ఉండ‌గా వైసీపీ అధిష్టానం ఊహించ‌ని రీతిలో మైల‌వ‌రంకు కొత్త ఇంఛార్జ్ గా స‌ర్నాల తిరుపతి రావును నియ‌మించింది.

దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యారు వ‌సంత కృష్ణ ప్ర‌సాద్. తాను ఎంతో క‌ష్ట‌ప‌డ్డాన‌ని, కానీ చివ‌రి నిమ‌షంలో నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ ను మార్చ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని వాపోయిన‌ట్లు టాక్. త‌ను కూడా ఊహించ లేదు. చివ‌రి దాకా తన‌కే పార్టీ బాధ్య‌త‌లు అప్పగిస్తుంద‌ని ఆశించారు.