జనవరి 13 నుంచి మహా కుంభమేళా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు
ఉత్తర ప్రదేశ్ – అత్యంత ప్రతిష్టాత్మకమైన సాంస్కృతిక పండుగ రానే వచ్చింది. కోట్లాది మంది ప్రజలు పాల్గొనే మహోత్సవం మహా కుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ సిద్దమైంది. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యానాథ్, పీఎం మోడీ ఈసారి కుంభమేళాను అత్యంత ఘనంగా, అంగరంగ వైభవోపేతంగా, నభూతో నభవిష్యత్ అనే రీతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ఏర్పాట్లలో మునిగి పోయింది రాష్ట్ర ప్రభుత్వం.
ఇదిలా ఉండగా వచ్చే ఏడాది 2025లో మహా కుంభమేళా జరగనుంది. కేంద్ర ప్రభుత్వం దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం పెద్ద ఎత్తున రవాణా సదుపాయాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా దేశం నలుమూలల నుంచి కుంభమేళాలో పాల్గొనేందుకు, స్నానాలు చేసేందుకు గాను ప్రత్యేకంగా 3,000 రైళ్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
రాష్ట్రంలోని నాలుగు చోట్ల ఈ కుంభ మేళా జరగనుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా జరుగుతుందని సర్కార్ ప్రకటించింది. దాదాపు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని కేంద్రం అంచనా వేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కుంభ మేళాలో నమూనా తిరుపతి ఆలయాన్ని ఏర్పాటు చేయనుంది.