NEWSTELANGANA

కేసీఆర్ ఆట‌లు సాగ‌వు – రేవంత్

Share it with your family & friends

రండ ప‌నులు చేసింది నీవు కాదా

హైద‌రాబాద్ – తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మాజీ సీఎం కేసీఆర్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌మ‌పై లేని పోని ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్న కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్ రావుల‌ను టార్గెట్ చేశారు. త‌మ స‌ర్కార్ కేంద్రానికి లొంగి పోయిందంటూ చేసిన విమ‌ర్శ‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఒక రండ అని, రండ ప‌నులు చేసి త‌మ‌పై దుమ్మెత్తి పోస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. పోలింగ్ రోజు ఏపీ పోలీసులు వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పైకి వస్తే నోరు ఎందుకు మెద‌ప లేద‌ని నిల‌దీశారు.

శాస‌న స‌భ వేదిక‌గా ప్రాజెక్టుల‌పై బ‌హిరంగ చ‌ర్చ పెడుదామ‌ని స్ప‌ష్టం చేశారు. అవ‌స‌ర‌మైతే ఉమ్బ‌డి స‌మావేశాలు చేప‌ట్టేందుకు సిద్దంగా ఉన్నామ‌న్నారు. ద‌మ్ముంటే చ‌ర్చించేందుకు రావాల‌ని స‌వాల్ విసిరారు రేవంత్ రెడ్డి.

నల్లగొండకు వెళ్లి నిరసన తెలపడం కాదు ముందు అసెంబ్లీలో చర్చకు రావాల‌న్నారు. ప్రాజెక్టుల శ్వేతపత్రంపై చర్చిద్దామ‌ని , ఇందులో అనుమానం ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు సీఎం. ఎవ‌రు వ‌చ్చినా స‌రే లేదంటే క‌ల్వ‌కుంట్ల కుటుంబం మొత్తం వ‌చ్చినా ప‌ర్వా లేద‌ని పేర్కొన్నారు.