SPORTS

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిసిన పీవీ సింధు

Share it with your family & friends

త‌న పెళ్లికి రావాల‌ని ఆహ్వానం

అమ‌రావ‌తి – ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు త్వ‌ర‌లో పెళ్లి కూతురు కాబోతోంది. ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్ కు చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌తో త‌ను మ‌నువాడ‌బోతోంది. పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా దేశంలోని ప్ర‌ముఖులు, వ్యాపార‌వేత్త‌లు, రాజ‌కీయ నేత‌లు, వివిధ హొదాల‌లో ఉన్న వారికి స్వ‌యంగా త‌నే ఆహ్వాన ప‌త్రిక‌ల‌ను అంద‌జేస్తోంది పీవీ సింధు. తాజాగా ఆమెతో పాటు త‌న తండ్రితో క‌లిసి ఆహ్వాన ప‌త్రిక‌ను ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్ తో పాటు ఉప ముఖ్య‌మంత్రి కొణిద‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిసి అంద‌జేశారు.

ఈ సంద‌ర్బంగా చాలా సేపు తండ్రీ కూతుళ్ల‌తో ముచ్చ‌టించారు ఏపీ డిప్యూటీ సీఎం. పెళ్లి చేసుకోబోతున్నందుకు ముంద‌స్తుగా అభినంద‌న‌లు తెలియ‌ చేశారు . కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు సంతోషం వ్య‌క్తం చేశారు.

త‌న‌తో పాటు త‌మ కుటుంబం ప్ర‌త్యేకంగా మీ పెళ్లికి వ‌స్తామ‌ని, ఆశీర్వ‌దిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు కొణిద‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *