చిరుకు శివ రాజ్ కుమార్ అభినందన
పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్
హైదరాబాద్ – కన్నడ సినీ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. ఆదివారం చిరంజీవి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మెగాస్టార్ ను అభినందించారు. కేంద్రంలోని మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ తాజాగా భారత దేశానికి చెందిన అత్యున్నతమైన పౌర పురస్కారాలను ప్రకటించింది.
ఈ అవార్డులలో పద్మ విభూషణ్ అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, టాలీవుడ్ కు చెందిన దిగ్గజ నటుడు చిరంజీవిని ఎంపిక చేసింది. ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు మెగాస్టార్ ను అభినందించారు.
ఇందులో భాగంగా హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో జరిగిన సన్మాన కార్యక్రమంలో వెంకయ్య నాయుడుతో పాటు చిరంజీవిని, పద్మశ్రీ అవార్డు గ్రహీతలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఘనంగా సన్మానించింది.
ఈ సందర్బంగా హైదరాబాద్ కు చేరుకున్న శివ రాజ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు చిరంజీవిని. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని కోరారు.