NEWSANDHRA PRADESH

రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం

Share it with your family & friends

మంత్రి పొంగూరు నారాయ‌ణ

అమ‌రావ‌తి – ఏపీ మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం త‌మ భూములు ఇచ్చిన రైతుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. నీరుకొండ‌లో ఎంజీఆర్ ట్ర‌స్ట్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

గ‌త స‌ర్కార్ రాజ‌ధానిని కావాల‌ని నాశ‌నం చేసింద‌ని ఆరోపించారు. ప‌ట్టాలు ఇచ్చిన పేద‌ల‌కు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో స్థ‌లాలు కేటాయిస్తామ‌న్నారు. అన్న‌దాత‌ల స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని, ఎలాంటి అనుమానం పెట్టుకోవ‌ద్ద‌ని సూచించారు నారాయ‌ణ‌.

ప‌నిగ‌ట్టుకుని మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి క‌క్ష పూరితంగా ఆర్5 జోన్ తీసుకు వ‌చ్చింద‌న్నారు. జోన్ లో పట్టాలు ఇచ్చిన పేదలకు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో స్థలాలు కేటాయిస్తామ‌న్నారు. సుప్రీం కోర్టు లో రాజధానిపై ఉన్న కేసులు పరిష్కరించేలా ముందుకు వెళుతున్నామ‌ని చెప్పారు.

గత ప్రభుత్వం పాత కాంట్రాక్ట్ లు రద్దు చేయక పోవడం తో ఆరు నెలలు వృధా అయింద‌న్నారు. లేదంటే అమరావతి పనులు ఎప్పుడో ప్రారంభం అయ్యేవన్నారు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌.
మరో 9 నెలల్లో అధికారులకు అమరావతిలో నివాసాలు అందుబాటులోకి తీసుకు వ‌స్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

గతంలో చెప్పిన విధంగానే రాజధానిని తూ.చ.తప్పకుండా పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణం కంప్లీట్ కాక త‌ప్ప‌ద‌న్ఆన‌రు. నీరు కొండ లో భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. ఇప్పటికే 20 వేల కోట్ల పనులకు టెండర్లకు అధారిటీ ఆమోదం తెలిపిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *