పోలవరం పనులపై సీఎం ఆరా
త్వరితగతిన చేపట్టాలని ఆదేశం
అమరావతి – పోలవరం ప్రాజెక్టును సోమవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్బంగా పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి కావాలని , అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఇంజనీరింగ్ నిపుణులు సీఎంకు వివరాలు అందజేశారు. పోలవరం పూర్తయితే వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు సీఎం.
ప్రాజెక్టు వద్దకు మధ్యాహ్నం చేరుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయనకు ఘన స్వాగతం పలికారు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు. నీటి పారుదల శాఖ మంత్రి రామానాయుడు, కొలుసు పార్థ సారథి, నాదెండ్ల మనోహర్, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ , ఎమ్మెల్యేలు చీరి బాలరాజు, మిరియాల శిరీషా దేవి ఉన్నారు.
మద్దిపాటి వెంకట రాజు. జిల్లా కలెక్టర్లు వెట్రి సెల్వి, పి.ప్రశాంతి, అలాగే ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్ సహా జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ, మెగా కంపెనీ ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పర్యవేక్షిస్తూ కొనసాగుతున్న పనులను పరిశీలించారు.