పోలవరం ఏపీకి జీవనాడి
సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా మారుతుందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ ప్రాజెక్టుకు పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తే ఇది ఓ గేమ్ ఛేంజర్ గా తయారవుతుందన్నారు. అన్ని జిల్లాలకు నీటి సమస్య అనేదే ఉండదన్నారు. సోమవారం సీఎం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్బంగా పనులను పరిశీలించరాఉ.
అనంతరం పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు. టెండరింగ్ అనే పేరు పెట్టి పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ జగన్ సర్కార్ సర్వ నాశనం చేసిందని ఆరోపించారు. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ఇది ఒక గేమ్ ఛేంజర్‌గా తయారవుతుంది
ఇది కనుక పూర్తి చేస్తే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు నీటి సమస్య అనేదే ఉండదని చెప్పారు ఏపీ సీఎం. 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే పోలవరం కాంట్రాక్టుని మారుస్తున్నామని ఆదేశాలు జారీ చేశారని ఆరోపించారు.
బలవంతంగా 2019, జులై 29న నోటీసులు ఇచ్చి సైట్ నుంచి వెళ్లి పోవాలని ఆర్డర్స్ ఇచ్చారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుని ఒక యజ్ఞంలా చేశామని అన్నారు సీఎం. మొత్తంగా వైసీపీ సర్కార్ బాధ్యతాయుతమైన నిర్వాకం కారనంగా ఇవాళ పోలవరం పూర్తి కాకుండా మిగిలి పోయిందన్నారు.