జనసేనలో చేరికపై మనోజ్ కామెంట్స్
ఇప్పుడు చెప్పలేనంటూ ప్రకటన
నంద్యాల జిల్లా – నటుడు మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరే విషయంపై తాను ఇంకా ఆలోచించ లేదన్నారు. తొలిసారి తన కూతురు దేవసేనను ఆళ్లగడ్డకు తీసుకు రావడం జరిగిందన్నారు. చేరేందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇంకా కుటుంబానికి సంబంధించిన సమస్యలు అలాగే ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. తొలుత బయటకు వచ్చారు మంచు మనోజ్. తనపై దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. పహాడి షరీఫ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తనపై దాడికి దిగాడంటూ తండ్రి మోహన్ బాబు రాచకొండ సీపీని కలిశారు. తనకు సెక్యూరిటీ ఇవ్వాలంటూ కోరారు.
ఆ తర్వాత జల్ పల్లి వద్ద మోహన్ బాబు అందరి ముందే రెచ్చి పోయాడు . ఓ జర్నలిస్ట్ గూబ గూయిమనిపించాడు. ఇది పెద్ద రాద్దాంతానికి దారి తీసింది. దీంతో మోహన్ బాబు, మనోజ్, విష్ణులపై కేసు నమోదు చేశారు. మోహన్ బాబు, విష్ణులకు చెందిన వెపన్స్ సీజ్ చేయాలని సీపీ సుధీర్ బాబు ఆదేశించారు.