రేపటి నుంచి టీటీడీ టికెట్లు రిలీజ్
వెల్లడించిన టీటీడీ చైర్మన్
తిరుమల – ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో మార్చి నెలకు సంబబంధించిన దర్శన టికెట్లు విడుదల చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేవలం అధికారిక టీటీడీ వెబ్ సైట్ ద్వారానే టికెట్లు పొందాలని సూచించింది.
2025 మార్చి నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం కు సంభందించి ఆన్ లైన్ కోటా విడుదల తేదీలు ప్రకటించింది టీటీడీ. 18వ తేదీ ఉదయం 10 గంటలకు నిత్యసేవలకు సంభందించి ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. 20న తేదీన ఉదయం 10 గంటలకు వరకు నమోదు ప్రక్రియకు అవకాశం .
21 తేదీన ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేస్తామని పేర్కొంది. 23 తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు విడుదల చేస్తామని వెల్లడించింది టీటీడీ.
23 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులా కోటా విడుదల చేస్తామని తెలిపింది. 24 తేదీన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదల చేస్తామని పేర్కొంది. 24 తేదీన వసతి గదుల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ.
భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ లో బుక్ చేసుకోవాలని..నకిలీ వెబ్‌సైట్ లను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.