జగన్ కోసం త్యాగానికి సిద్దం
ఐటీ శాఖ మంత్రి అమర్ నాథ్
అమరావతి – ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీలో టికెట్ల కేటాయింపుపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ బాస్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇదే సమయంలో చాలా మంది సిట్టింగ్ లకు ఈసారి మొండి చేయి చూపారు. దీంతో కొందరు పక్క చూపులు చూస్తున్నారు. ఎంపీ బాల శౌరి గుడ్ బై చెప్పారు. పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జన సేన పార్టీ జెండా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా గుడివాడ అమర్ నాథ్ మీడియాతో మాట్లాడారు. తాజాగా శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్న దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి తల రాతలు దేవుడు రాస్తే తన తల రాతను జగన్ రెడ్డి మారుస్తారని స్పష్టం చేశారు.
జగన్ మోహన్ రెడ్డి కోసం ఏ త్యాగం చేసేందుకైనా సిద్దమని అన్నారు గుడివాడ అమర్ నాథ్. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. జగన్ రెడ్డి తిరిగి సీఎం కావడం కోసం తాను జెండా మోసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు . తాజాగా అమర్ నాథ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.