జయ జయహే తెలంగాణ
రాష్ట్ర గేయంగా కేబినెట్ ఆమోదం
హైదరాబాద్ – తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఊపిరి పోసి, కోట్లాది మందిలో చైతన్యాన్ని రగిలించిన కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటకు అరుదైన గౌరవం లభించింది. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించింది ఈ పాట . దీనిని అందెశ్రీ సెప్టెంబర్ 2003లో రాశారు. ఈ పాట పోటెత్తేలా చేసింది. పోరాటాలు, ఉద్యమాలకు, ఆందోళనలకు దోహద పడింది. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లవుతున్నా జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించ లేదు ఆనాటి బీఆర్ఎస్ సర్కార్.
మాజీ సీఎం కేసీఆర్ కక్ష సాధింపు ధోరణికి అలవాటు పడ్డారు. కోట్లాది మంది ఈ గీతాన్ని ప్రకటిస్తారని ఆశించినా దానికి చెక్ పెట్టారు తెలివిగా. ఒక రకంగా చెప్పాలంటే దొరతనం ఒప్పుకోలేదు. ఒక బహుజనులు రాసిన గీతాన్ని తాను ఎందుకు రాష్ట్ర గీతంగా ప్రకటించాలని అనుకున్నారు. అందుకు ఆయన చుట్టూ చేరిన భజన బృందం అడ్డుకుంది కావాలని. ఇదంతా జగ మెరిగిన సత్యం.
తాజాగా రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించింది. అది ఇవాల్టి నుంచే అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా పలు అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకుంది కేబినెట్.