కొండా సురేఖ కాదు కాసుల సురేఖ
బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి
వేములవాడ – బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. మంత్రి కొండా సురేఖ కాదని కాసుల సురేఖ అంటూ మండిపడ్డారు. ఇవ్వాళ రాజన్న కోడెలను కాదు అమ్మింది కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆగం చేసిందన్నారు.
కోడెలను కబేళానికి పంపిన కసాయి సురేఖ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడ రాజన్న కోడెలను మంత్రి కొండా సురేఖ సిఫారసుతో అక్రమంగా కబేళాలకు తరలించిన పాపానికి, పాప ప్రక్షాళన కోసం, ప్రాయశ్చిత్తం కోసం రాజన్న సన్నిధిలో శాంతిహోమం నిర్వహించామన్నారు.
హన్మకొండ నుండి తెచ్చిన కోడెను సమర్పించి, వేములవాడ మున్సిపల్ ఛైర్మెన్ రామతీర్థపు మాధవిరాజు ఇతర సీనియర్ నాయకులతో కలిసి వేములవాడ గోషాలను శుద్ధి చేశారు. పరమేశ్వరుడికి ఆగ్రహం వస్తే మూడో కన్ను ముల్లోకాలు విలయతాండవం ఆడుతాయన్నారు.
అలాంటిది. ఏకంగా శివుడి వాహనమైన నందినే కబేళాలకు తరలించి కాంగ్రెస్ పార్టీ తన గొయ్యి తానే తీసుకుందన్నారు. కొండా సురేఖ గారు కాశీకి వెళ్ళినా పాపం పోదన్నారు. ఎందుకంటే స్వయంగా ఆ రాజన్న కోడెనే అపచారం చేసిందన్నారు.
ఓరుగల్లు ఒక గొప్ప శైవ క్షేత్రం. అడుగడుగునా శివాలయాలలో విలసిల్లుతున్న గడ్డ, సుమారు 400 ఏళ్లపాటు ఓరుగల్లు రాజధాని కేంద్రంగా పాలన చేసిన కాకతీయులు గొప్ప శివ భక్తులు అన్నారు.
అలాంటి, ప్రాంతం నుండి ప్రాతినిథ్యం వహిస్తూ, ప్రజా విశ్వాసాలకు విరుద్ధంగా స్వయంగా తన సిఫారసుతో రాజన్న కోడెలను కోతకు పంపి ప్రజల నమ్మకాలను, మనోభావాలను హత్య చేసిందన్నారు.