ముగిసిన జ‌న నాయ‌గ‌న్ ప్ర‌స్థానం

Spread the love

క్రిక్కిరిసి పోయిన కౌలాలంపూర్

మ‌లేషియా : త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ ఫేవ‌ర‌బుల్ హీరోగా గుర్తింపు పొందిన ద‌ళ‌ప‌తి విజ‌య్ సినీ ప్ర‌స్థానం ఇక ముగిసింది. మ‌లేషియాలోని కౌలాలంపూర్ లో త‌ను న‌టించిన చివ‌రి చిత్రం జ‌న నాయ‌గ‌న్ ఆడియో లాంచింగ్ గ్రాండ్ గా జ‌రిగింది. వేలాది మంది అభిమానులు తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు. ఎక్క‌డ చూసినా త‌న ఫోటోలే క‌నిపించాయి. నిన్న‌టి నుంచి ఇవాల్టి దాకా సోష‌ల్ మీడియా మొత్తం జ‌న నాయ‌గ‌న్ తో నిండి పోయింది. త‌న తండ్రి చంద్ర‌శేఖ‌ర్ సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వారు. త‌ను సినిమా రంగంలోకి 1992లో ప్ర‌వేశించాడు. అంచెలంచెలుగా సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్నాడు. దీని వెనుక చాలా శ్ర‌మ ఉంది. ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అత్య‌ధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక న‌టుడు విజ‌య్. త‌ను క్రిస్టియ‌న్ క‌మ్యూనిటీకి చెందిన వ్య‌క్తి. ఎందుక‌నో త‌న‌కు పేద‌లంటే ప్రేమ‌. ముందు నుంచీ వారికోసం ఏదైనా చేయాల‌ని అనుకున్నాడు.

ఆ మేర‌కు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కోట్లు కురిపించే సినిమా రంగానికి పీక్ స్టేజిలో ఉన్న స‌మ‌యంలో త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇంకొక‌రైతే దానినే అంటి పెట్టుకుని ఉండేవాళ్లు. కానీ త‌నంటే ప్రాణాలు ఇచ్చే వాళ్లు ఎంద‌రో అభిమానులు ఉన్నారు . త‌న సినీ కెరీర్ కు సంబంధించి జ‌న నాయ‌గ‌న్ సినిమా ఆఖ‌రుది అవుతుంద‌ని ప్ర‌క‌టించాడు. ఈ విష‌యాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోయారు. వేలాది మంది క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. జ‌న నాయ‌కా అంటూ హోరెత్తి నిన‌దించారు. తాజాగా త‌ను చేసే ఈవెంట్ కు వ‌చ్చే ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయ‌డం క‌ష్ట‌మ‌ని భావించారు. అందుకే మ‌లేషియాలోని కౌలాలంపూర్ లో జ‌న నాయ‌గ‌న్ ఆడియోను లాంచ్ చేశారు. అయినా అక్క‌డ కూడా పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు అభిమానులు. ఈ సంద‌ర్బంగా చివ‌రి సారిగా వారంద‌రి కోరిక మేర‌కు కొద్దిసేపు స్టేజి మీద‌నే డ్యాన్స్ చేశాడు ద‌ళ‌ప‌తి విజ‌య్. 1992 నుంచి 2006 అంటూ ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా అనే క్యాప్షన్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది.

  • Related Posts

    భారీ ధ‌ర ప‌లికిన ప‌వ‌న్ కళ్యాణ్ సినిమా

    Spread the love

    Spread the loveఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ నెట్ ఫ్లిక్స్ స్వంతం హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌న‌తో డైన‌మిక్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ మ‌రోసారి…

    మార్కెట్ మోసానికి గురైన డైరెక్ట‌ర్ కొడుకు

    Spread the love

    Spread the loveరూ. 63 ల‌క్ష‌లు కోల్పోయానంటూ ఫిర్యాదు హైద‌రాబాద్ : సైబ‌ర్ వ‌ల‌లో ప‌లువురు ప‌డ్డారు. కోట్లాది రూపాయ‌లు న‌ష్ట పోతున్నారు. క‌ష్ట‌ప‌డిన వారంతా అత్యాస‌కు గురై డ‌బ్బుల‌ను కోల్పోతున్నారు. నిన్న మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ భార్య ఏకంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *