NEWSTELANGANA

కేసీఆర్ ద‌మ్ముంటే దా – రేవంత్

Share it with your family & friends

రండ ప‌నులు చేసింది నీవు కాదా

హైద‌రాబాద్ – రండ ప‌నులు చేసింది నీవు కాదా. ప‌దేళ్లుగా తెలంగాణ‌ను అభివృద్ది పేరుతో నాశ‌నం చేసిన చ‌రిత్ర నీది అంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై. త‌న‌ను , త‌మ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు.

రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మామా అల్లుడు క‌లిసి కొత్త డ్రామాకు తెర లేపారంటూ మండిప‌డ్డారు. ద‌మ్ముంటే తాము ఆధారాల‌తో వ‌స్తామ‌ని, మీరు కూడా అసెంబ్లీకి రావాల‌ని స‌వాల్ విసిరారు. కేసీఆర్ తో పాటు కొడుకు కేటీఆర్, కూతురు క‌విత‌, అల్లుడు హ‌రీశ్ రావు వ‌స్తే సంగతి ఏమిటో తేలుతుంద‌న్నారు రేవంత్ రెడ్డి.

అబ‌ద్దపు ప్ర‌చారాల‌తో రాజ‌కీయ ల‌బ్ది పొందాల‌ని చేయ‌డం మంచి ప‌ద్ధ‌తి కాద‌న్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడే కృష్ణా, గోదావరి జలాల పంపిణీని కేంద్రానికి అప్పగిస్తున్నట్లు నువ్వు ఒప్పుకున్న‌ది నిజం కాదా అని ప్ర‌శ్నించారు.
.
ఆనాడు టీఆరెస్ అభ్యంతరం చెప్పక పోగా కేసీఆర్ ఓటు వేసి చట్టాన్ని ఆమోదింప చేశారంటూ ఆరోపించారు. దీనికి ప్ర‌ధాన బాధ్యులు కేసీఆర్, కేశ‌వ‌రావు అంటూ ధ్వ‌జ‌మెత్తారు. 299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు కేటాయించేందుకు కేసీఆర్, హరీష్ సంతకాలు పెట్టారని చెప్పారు.

తెలంగాణకు 50 శాతం వాటా అడగకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కృష్ణా నది 68శాతం తెలంగాణలో ఉంది.. 32 శాతం మాత్రమే ఏపీలో ఉందన్నారు. అంతర్జాతీయ నీటి విధి విధానాల ప్రకారం 5 వందల పైచిలుకు తెలంగాణకు, మిగతావి ఏపీకి కేటాయించాల్సి ఉంద‌న్నారు. కానీ అలా జ‌ర‌గ‌లేద‌ని పేర్కొన్నారు.

సంతకాలు పెట్టి మరీ తెలంగాణకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని సీరియ‌స్ అయ్యారు. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసే నిర్ణయం జరిగినపుడు హరీష్, నాయిని నర్సింహారెడ్డి మంత్రులుగా ఉన్నారని, కేంద్రంలో కేసీఆర్ మంత్రిగా ఉన్న విష‌యం మ‌రిచి పోతే ఎలా అని నిల‌దీశారు..

పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించుకు పోతుంటే కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ నేతలు పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి అని, వాళ్లకు సహకరించకుండా వైఎస్ కు లొంగిపోయింది నువ్వు కాదా కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు.

14 జనవరి 2020న జగన్ ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి కృష్ణా జలాల పై 6 గంటలు సమీక్ష చేశారన్నారు. అక్కడే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీలు తరలించుకు పోయేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపించారు.

తండ్రి పోతిరెడ్డిపాడుతో రోజుకు 4 టీఎంసీలు తరలించుకు పోతే.. కొడుకు రాయలసీమ లిఫ్ట్ తో రోజుకు 8 టీఎంసీలు తరలించుకు పోయాడ‌ని జ‌గ‌న్ పై విరుచుకుప‌డ్డారు రేవంత్ రెడ్డి. నీటి తరలింపుకు టెండర్ ఆపేందుకు సమావేశానికి వెళ్లకుండా సమావేశాన్ని వాయిదా వేయాలని లేఖ రాయించారని అన్నారు.

తెలంగాణ హక్కులను కాలరాస్తూ నీటి దొంగలు కృష్ణా జలాలను దారి దోపిడీ చేస్తున్నారని, ఈ జల దోపిడీకి కారణం కేసీఆర్ అని ధ్వ‌జ‌మెత్తారు. పదేళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయలేక పోయారని, .
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన దాని కంటే ఎక్కువ ఈ నిర్లక్ష్యం పదేళ్లలో జరిగిందన్నారు సీఎం.

పాల‌మూరు – రంగారెడ్డి పడావు పడ్డదన్నారు. రెండేళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్… పదేళ్లయినా పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. పాపాలు చేసి ప్రజా ఉద్యమాలంటే ప్రజలు చెప్పుతో కొడతారని హెచ్చ‌రించారు.