రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో
హైదరాబాద్ : పీపుల్స్ మీడియా సంస్థ అధినేత విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం రాజా సాబ్. ఇందులో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు ప్రభాస్. తనతో పాటు రిధి, మాళవిక మోహన్, నిధి అగర్వాల్ ఇందులో కీ రోల్ పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. మారుతి చాన్నాళ్ల పాటు రిస్క్ తీసుకుని రాజా సాబ్ ను తీశాడు. ఇప్పటికే మూవీ పూర్తయింది. ఇందుకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ , గ్లింప్స్ విడుదలయ్యాయి. ఈ సందర్బంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని కూకట్ పల్లి గ్రౌండ్ లో గ్రాండ్ గా జరిగింది. భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్బంగా తమకు ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు సినీ నటులు.
మరో వైపు రాజా సాబ్ సినిమా డిఫరెంట్ గా ఉంటుందని, తన సినీ కెరీర్ లో గతంలో నటించిన పాత్రలకంటే భిన్నంగా ఇందులో నటించారని ప్రకటించాడు దర్శకుడు మారుతి. ఇదే సమయంలో వేదిక పై నుంచే మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దుఖాఃన్ని ఆపుకోలేక పోయాడు. చివరకు నటుడు ప్రభాస్ స్టేజి పైకి రావాల్సి వచ్చింది. తనను మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ప్రభాస్ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఈ సినిమాలో పూర్తిగా రొమాంటిక్ పాత్ర పోషించాడని చెప్పాడు దర్శకుడు. అంతే కాదు ఇందులో ప్రభాస్ పాత్ర సరిగా లేదని అనుకుంటే తన ఇంటికి రావాలని ప్రకటించాడు. ఇదే క్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు లవ్లీ బ్యూటీ మాళవిక మోహన్.






