జగన్ పై గూడురు ఎమ్మెల్యే గరం
మమ్మల్ని నట్టేట ముంచాడు
అమరావతి – ఏపీలో ఎన్నికల వేళ తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నిన్నటి దాకా మౌనంగా ఉన్న వారు, టికెట్లు చివరి నిమిషంలో కోల్పోయిన వారంతా నిప్పులు చెరుగుతున్నారు.
వైసీపీకి చెందిన గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్ రావు వెలగపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ చీఫ్ జగన్ రెడ్డిపై. తమను నట్టేట ముంచాడని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఎవరూ కూడా జగన్ రెడ్డిని అనేందుకు సాహించడం లేదన్నారు.
కేవలం ప్రతిపక్ష నేతలను బండ బూతులు తిట్టిన వారికే ప్రయారిటీ ఉందని, వారికే అత్యధికంగా పదవులు దక్కుతున్నాయని వాపోయారు. వైసీపీ కష్ట కాలంలో ఉన్న సమయంలో తాను అండగా ఉన్నానని కానీ పట్టించు కోలేదని మండిపడ్డారు వర ప్రసాద్ రావు వెలగపూడి.
తిరుపతి లోక్ సభ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు. పార్టీ తనను వెళ్లమన్నా ఉండేందుకు తాను సిద్దంగా లేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏ పార్టీలో చేరుతాననే విషయం ఇప్పట్లో చెప్పలేనని పేర్కొన్నారు. త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు .