ఇండియా కూటమి నేతల ఆందోళన
బీజేపీ..కాంగ్రెస్ ఎంపీల తోపులాట
ఢిల్లీ – రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసనలు చేపట్టారు. ఈ సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒడిశా ఎంపీ ప్రతాప్ చంద్ర కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
కాంగ్రెస్ అమిత్ షాపై ప్రివిలేజ్ మోషన్ను ముందుకు తీసుకువెళ్లింది . తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి డెరెక్ ఓబ్రెయిన్ ఇదే విధమైన నోటీసును సమర్పించిన ఒక రోజు తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్పి) మల్లికార్జున్ ఖర్గే తీర్మానం వచ్చింది.
అంబేద్కర్ పేరును పునరావృతం చేసే పద్ధతిలో కాకుండా భగవంతుని నామం జపించి ఉంటే స్వర్గంలో స్థానం సంపాదించి ఉండే వారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా.
ఇదిలా ఉండగా రాష్ట్రాల మండలి (రాజ్యసభ)లో విధి విధానాలు, వ్యాపార ప్రవర్తన రూల్ 188 కింద హోం వ్యవహారాల మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ప్రత్యేకాధికారాల ప్రశ్నకు తాను ఇందు మూలంగా నోటీసు ఇస్తున్నానని ఖర్గే తన నోటీసులో పేర్కొన్నారు.
ఈ సందర్బంగా ఎంపీ రాహుల్ గాంధీ సిరియస్ అయ్యారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని షాను ఉద్దేశించి డిమాండ్ చేశారు.