అందెశ్రీ తెలంగాణ సాంస్కృతిక పతాక
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటన
హైదరాబాద్ – యావత్ తెలంగాణ సమాజం సగర్వంగా తల ఎత్తుకునేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. గత పదేళ్లుగా విధ్వంసకరమైన పాలన సాగించిన బీఆర్ఎస్ రాచరికపు పోకడలకు స్వస్తి పలికేలా చేసిన ఘనత సీఎంకే దక్కుతుంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కవులు, కళాకారులు ఎందరో. కళా రూపాలు ఎన్నో.
నాలుగున్నర కోట్ల ప్రజల్ని ఒకే చోటుకు చేర్చాయి ఎన్నో పాటలు, గీతాలు. కానీ అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాట ఎప్పటికీ చిర స్థాయిగా నిలిచే ఉంటుంది. ఈ విషయాన్ని పదే పదే స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. పదేళ్ల పాటు చేయలేని పనిని రేవంత్ రెడ్డి చేసి చూపించాడు.
జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఒక జాతి అస్తిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పకనే చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి. రాచరికపు పోకడలు లేని తెలంగాణ రాష్ట్రంగా తాను చూడాలని అనుకున్నానని అదే ఆచరణలో చేస్తున్నట్లు ప్రకటించారు.