జగన్ పారి పోయేందుకు సిద్దమా
వైసీపీ ఎంపీ బాల శౌరి కామెంట్స్
అమరావతి – ఏపీ వైసీపీలో ఒకరి తర్వాత మరొకరు గుడ్ బై చెబుతున్నారు. మరో వైపు తెలుగుదేశం, జనసేన కూటమికి రోజు రోజుకు ఆదరణ పెరుగతోంది. మరో వైపు వైఎస్ షర్మిలా రెడ్డి సారథ్యంలోని ఏపీ పీసీసీ దూకుడు పెంచింది.
ఇప్పటి దాకా తన మాటే వేదం, శిరోధార్యంగా భావిస్తూ వచ్చిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కోలుకోలేని రీతిలో షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. గూడురు శాసన సభ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమను జగన్ రెడ్డి నట్టేట ముంచాడంటూ ధ్వజమెత్తారు.
ఇదే సమయంలో వైసీపీకి చెందిన ఎంపీ బాల శౌరి నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. జగన్ రెడ్డి పనై పోయిందని, ఇక పారి పోయేందుకు సిద్దంగా ఉండాలని అన్నారు.
ఆయన జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ చేతిలో కండువా కప్పుకున్నారు. మచిలీపట్నం ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దం అంటూ సభలు పెట్టడం దారుణమన్నారు. దేనికి సిద్దమని ప్రశ్నించారు. జన సైనికులు నిన్ను వెంటాడటం ఖాయమని హెచ్చరించారు.