NEWSANDHRA PRADESH

ఆన్ లైన్ లో వీఐపీ ద‌ర్శ‌నం టికెట్లు

Share it with your family & friends

టీటీడీ సంచ‌ల‌న నిర్ణ‌యం

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది. రోజు రోజుకు భ‌క్తుల ర‌ద్దీ పెరుగుతోందే త‌ప్పా త‌గ్గ‌డం లేదు. ప్ర‌ధానంగా వీఐపీల తాకిడి పెరుగ‌తోంది.

ఇదే స‌మ‌యంలో సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే వారికి తీవ్ర ఇబ్బంది ఎదుర‌వుతోంది. వీఐపీల‌కు సంబంధించి లెట‌ర్లు ఇవ్వ‌డం, క్యూలో నిల్చోవ‌డం, టికెట్ల‌ను జారీ చేయ‌డం , గ‌దుల‌ను కేటాయించ‌డం త‌ల‌కు మించిన భారంగా మారింది.

దీంతో భ‌క్తుల నుంచి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది టీటీడీ నిర్వ‌హ‌ణ తీరుపై. దీనిని గ‌మ‌నించిన టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క సూచ‌న చేసింది. వీఐపీల‌కు సంబంధించి జారీ చేసే టికెట్ల‌ను ఇక ప్ర‌త్యక్షంగా కాకుండా ఆన్ లైన్ లో విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని సోమ‌వారం టీటీడీ అధికారికంగా ప్ర‌క‌టించింది.

క్యూ లైన్ ల‌లో నిరీక్షించాల్సిన ప‌రిస్థితి త‌ప్పింది. దీంతో ఎంతో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి స్వామి వారిని ద‌ర్శించుకునే భాగ్యం మ‌రింత సుల‌భ‌త‌రం కానుంది. తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణ‌యంపై భ‌క్త బాంధ‌వులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.