DEVOTIONAL

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో స‌ద‌స్సు స‌క్సెస్

Share it with your family & friends

టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డి

తిరుమ‌ల – : తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న ధార్మిక సదస్సుకు 57 మంది స్వామీజీలను ఆహ్వానించగా అందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుగ్రహ భాషణం అందించారని, ఈ విధంగా సదస్సు విజయవంతమైందని టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి తెలిపారు.

సదస్సు రెండో రోజు ఈవో మాట్లాడుతూ నభూతో నభవిష్యతి అన్నట్టుగా ధార్మిక సదస్సు జరిగిందన్నారు. ధార్మిక సదస్సుకు స్వామి వారి ఆశీస్సులు చక్కగా ఉన్నాయనడంలో సందేహం లేదన్నారు. సదస్సులో శనివారం 24 మంది మహనీయులు, ఆదివారం 17 మంది మహనీయలు ప్రత్యక్షంగా, 16 మంది వర్చువల్ గా తమ సూచనలు, సలహాలు ఇచ్చారని వివరించారు.

మఠాధిపతులు, పీఠాధిపతులు తమ కీలక సలహాలు, సూచనలిచ్చి టీటీడీకి దిశా నిర్దేశం చేశారని చెప్పారు. మహనీయుల ఉపన్యాసాలను రికార్డ్ చేశామని, వీటిని తీర్మానాలుగా చేసి రేపటి రోజున మఠాధిపతులు, పీఠాధిపతులు సమక్షంలో మీడియా ప్రతినిధుల ముందు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ప్రవేశ పెడతారని తెలిపారు. వచ్చే బోర్డు సమావేశంలో వీటిని ఆమోదించి టీటీడీ తదుపరి కార్యాచరణ చేపడుతుందని వెల్లడించారు.