ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలి
పిలుపునిచ్చిన నాదెండ్ల మనోహర్
మంగళగిరి – ఏపీలో శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి సత్తా చాటాలని పిలుపునిచ్చారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ మనోహర్. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందారు. వైసీపీ విముక్త రాష్ట్రం లక్ష్యంగా రానున్న రెండు నెలలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు.
తమ వ్యాపారాల కోసం కొందరు ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించారని ఆరోపించారు. వారి స్వార్థం వల్లనే విభజన సమయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. తెలుగు వారంతా గర్వపడే విధంగా భవిష్యత్తులో పార్లమెంట్ లో జనసేన వాయిస్ వినిపించడం ఖాయమని జోష్యం చెప్పారు మనోహర్.
ప్రజలు స్పష్టంగా ఉన్నారని, తమ తీర్పు వెలువరించేందుకు సిద్దంగా ఉన్నారని, జగన్ రెడ్డి దౌర్జన్య, రాచరిక, రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
మరోసారి వీరికి ఓటు వేస్తే తమ ప్రాణాలను వ్యాపారంగా మార్చేస్తారని జర జాగ్రత్త అంటూ హెచ్చరించారు.