పుష్ప-2 రికార్డ్ కలెక్షన్స్ కిర్రాక్
బాలీవుడ్ లో రూ. 632.50 కోట్లు
హైదరాబాద్ – మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో దిగ్గజ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప -2 మూవీ కలెక్షన్లలో దుమ్ము రేపింది. బాలీవుడ్ కు సంబంధించి 100 ఏళ్ల చరిత్రలో ఏ సినిమా సాధించని వసూళ్లు పుష్ప-2 సాధించిందని నిర్మాతలు వెల్లడించారు. రూ. 632.50 కోట్లు వసూలు చేసిందని ఇదే అత్యుత్తమ రికార్డ్ అని పేర్కొన్నారు. అల్లు అర్జున్, శ్రీలీల, రష్మిక మందన్నా ఇందులో నటించారు.
డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా పుష్ప-2 చిత్రం రిలీజ్ చేశారు నిర్మాతలు. రికార్డు స్థాయిలో 12,000 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలి వారంలోనే రూ. 1,000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదే సమయంలో పెద్ద ఎత్తున పుష్ప-2 పై తీవ్ర విమర్శలు కూడా చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్ లోని పుష్ప-2 ప్రీమియర్ షో సందర్బంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఇంకొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. ఈ కేసుకు సంబంధించి సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఒక రోజు చెంచల్ గూడ జైలులో ఉంచారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మొత్తంగా పుష్ప-2 వివాదాస్పదంగా ముగిసింది.