ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ రిలీజ్
ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్ తో మ్యాచ్
దుబాయ్ – ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. శనివారం అధికారికంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసింది. గ్రూప్ -ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ , బంగ్లాదేశ్ జట్లు ఉండగా బి – గ్రూప్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ , దక్షిణాఫ్రికా , ఆఫ్గనిస్తాన్ జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్తాన్ , మార్చి 2న న్యూజిలాండ్ జట్లతో టీమిండియా పోటీ పడనుందని తెలిపింది ఐసీసీ.
ప్రపంచ వ్యాప్తంగా ఈ ఈవెంట్ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇది తారా స్థాయికి చేరుకుంది. నెలల తరబడి సాగిన చర్చల అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మధ్య ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చింది.
ప్రధానంగా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల రీత్యా బీసీసీఐ తమ జట్టును పంపించబోమంటూ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది మోడీ ప్రభుత్వం.