ENTERTAINMENT

సీఎం కామెంట్స్ అల్లు అర్జున్ సీరియ‌స్

Share it with your family & friends

రేవంత్ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వం

పుష్ప‌-2 మూవీ ఘ‌ట‌న‌పై సీరియ‌స్ గా స్పందించారు న‌టుడు అల్లు అర్జున్. అసెంబ్లీలో సీఎం త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. తన‌పై చేసిన ఆరోప‌ణ‌లు పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని, వాస్త‌వ దూర‌మ‌ని పేర్కొన్నారు. జ‌రిగిన ఘ‌ట‌న బాధాక‌ర‌మ‌ని అన్నారు. రేవతి చ‌ని పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మని వాపోయారు. అనుకోని ప్ర‌మాదం జ‌రిగింద‌న్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌లో వాస్త‌వం లేద‌న్నారు. ప‌ర్మిష‌న్ ఉండ‌డం వ‌ల్ల‌నే వెళ్లాన‌ని చెప్పారు.

శ‌నివారం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. ఇందులో ఎవరిది తప్పు లేదన్నారు. అంతా మంచి జరగాలనుకున్నా, అనుకోని ప్రమాదం జరిగిందని ఆవేద‌న చెందారు. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్న‌ట్లు తెలిపారు.

సినిమాకు వచ్చేవారిని ఎంటర్‌టైన్‌ చేయాలనుకుంటాన‌ని అన్నారు అల్లు అర్జున్.. శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాన‌ని చెప్పారు. త‌న ఆరోగ్యం మెరుగు ప‌డాల‌ని కోరుకుంటాన‌ని అన్నారు. తాను ఎవ‌రినీ దూషించ లేద‌ని పేర్కొన్నారు. త‌నను 20 ఏళ్లుగా చూస్తున్నార‌ని , తాను ఎవ‌రి విష‌యంలో జోక్యం చేసుకోన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌పై చేస్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌లు బాధ క‌లిగిస్తున్నాయ‌ని, మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం క‌ష్ట ప‌డ్డాన‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *