బెనిఫిట్ షోలు..టికెట్ ధరలకు చెక్
సినీ ఇండస్ట్రీకి సీఎం బిగ్ షాక్
హైదరాబాద్ – తెలుగు సినిమా రంగానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నుంచి ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా సినీ హీరో అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తను రూల్స్ కు వ్యతిరేకంగా ప్రవర్తించాడని, ఆయన ఏమైనా దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవుడా అని ప్రశ్నించారు. డీసీపీ హెచ్చరించినా పట్టించు కోలేదని , అరెస్ట్ చేస్తామంటే వెళ్లారని ఆరోపించారు. తన పదవీ కాలంలో ఉన్నంత కాలం ఈ ధరల పెంపు ఉండదు..బెనిఫిట్ షోలు కుదరవు అని తేల్చేశారు.
ఎంతటి స్థార్ అయినా సరే వారి సినిమాలకు సంబంధించి రేట్లను పెంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇంత కాలం తమ ఇష్టానుసారం వ్యవహరించారని, స్టార్లు కూడా మనుషులేనని గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. గతంలో అంటకాగిన వారు ఒకసారి ఆలోచించు కోవాలని అన్నారు.
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే తనను టార్గెట్ చేశారని, అమ్మనా బూతులు తిట్టారని, దానికి వంత పాడుతూ బీఆర్ఎస్ నేతలు తగదునమ్మా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.