కొర్రపత్తి స్కూల్ ను అభివృద్ది చేస్తా
హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్
అమరావతి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. తన ట్రస్టు నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కొర్రపత్తి ఎంపీపీ స్కూల్ ను అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా అక్కడి బడి పిల్లలతో ముచ్చటించారు.
పాఠశాలలో మౌలిక సదుపాయల కల్పనకు నిధులు ఇస్తానని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న స్కూల్ స్లాబ్, ప్రహరీగోడను చేపట్టాల్సి ఉందని , వీటిని వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
అదే విధంగా అక్కడ అంగన్వాడీ సెంటర్, స్కూల్ ప్రహరీ గోడ , ఆ ఊరిలో సీసీ రోడ్లు పంచాయతీరాజ్ శాఖ నిధుల నుండి అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్. తమ ప్రభుత్వం విద్యా రంగం పట్ల ఫోకస్ పెడుతున్నామని అన్నారు.
వైద్య రంగానికి ప్రయారిటీ ఇస్తామన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం. గత వైసీపీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలని గిరిజన ప్రాంతాలను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాము వచ్చాక గిరి పుత్రుల అభివృద్దికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.