భారత్ భళా ఇంగ్లండ్ విలవిల
రెండో టెస్టులో గ్రాండ్ విక్టరీ
విశాఖపట్నం – విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు ఇంగ్లండ్ పై గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్లు బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ధాటికి తట్టుకోలేక పోయారు. వెంట వెంటనే వికెట్లను సమర్పించుకున్నారు.
5 టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా ఇరు జట్లు చెరీ సమానంగా గెలిచాయి. తొలి టెస్టు హైదరాబాద్ లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడి పోయింది. రెండో టెస్టులో ఇండియా బోణీ కొట్టింది. 106 పరుగుల తేడాలో అద్భుత గెలుపు నమోదు చేసింది.
292 పరుగులకే ఆలైటైంది. అంతకు ముందు భారత జట్టులో యువ ఆటగాళ్లు జైశ్వాల్ డబుల్ సెంచరీతో రెచ్చి పోతే గిల్ సెంచరీతో సత్తా చాటాడు. ఇక మూడో టెస్టు ఈనెల 15 నుంచి రాజ్ కోట్ లో జరగనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే జెట్ స్పీడ్ గా పేరొందిన బుమ్రా కేవలం 46 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
ఇక ఆర్. అశ్విన్ 71 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే 75 రన్స్ ఇచ్చి పటేల్ ఒక వికెట్ తీశాడు. కుల్దీప్ యాదవ్ కూడా ఒక వికెట్ తీశాడు. ఇంగ్లండ్ జట్టులో జాక్ క్రాలీ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 73 రన్స్ చేశాడు.