నారా లోకేష్ కొడుకు దేవాన్ష్ రికార్డ్
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరిల మనుమడు, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి పుత్రుడు నారా దేవాన్ష్ అరుదైన ఘనత సాధించారు. చిన్నతనంలోనే తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. తాతకు తగ్గ తనయుడిగా గుర్తింపు పొందాడు. ఏకంగా ప్రపంచ రికార్డ్ సృష్టించాడు.
తనకు చిన్నప్పటి నుంచి చదదరంగం ఆట అంటే వల్లమాలిన అభిమానం. దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. తాజాగా చదరంగానికి సంబంధించి వేగవంతంగా పావులు కదిపాడు. చెక్ మేట్ సాల్వర్ 175 పజిల్స్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు.
ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నాడు. ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నందమూరి బాలకృష్ణతో పాటు మంత్రులు వంగలపూడి అనిత, కొలుసు పార్థసారథి, డాక్టర్ పొంగూరు నారాయణ, వాసంశెట్టి సుభాష్, కింజారపు అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాస్ రావుతో పాటు బీజేపీ చీఫ్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.