బౌన్సర్లకు సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
గీత దాటితే చర్యలు తప్పవు
హైదరాబాద్ – బౌన్సర్లు, ప్రైవేట్ బాడీ గార్డ్స్ పేరుతో చట్టానికి వ్యతిరేకంగా ఎవరిపైన నైనా దాడులు, బెదిరింపులు చేస్తే క్రిమినల్ కేసులతో జైలు ఊచలు లెక్కించక తప్పదని హెచ్చరించారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. బౌన్సర్లకైనా, ప్రైవేట్ బాడీ గార్డ్స్ కైనా పరిమితులు ఉంటాయని స్పష్టం చేశారు. అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అల్లు అర్జున్ నిర్వాకం కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుందన్నారు.
ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యవహారంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయన అల్లు అర్జున్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం సాధించాడని సినీ సెలిబ్రిటీలు క్యూ కట్టారంటూ ప్రశ్నించారు.
అల్లు అర్జున్ కు ఏమైందని సందర్శించారని, పరామర్శించారంటూ ఎద్దేవా చేశారు. అంతే కాదు ఆయనకు ఏమైనా కాలు పోయిందా, కిడ్నీలు పాడయ్యాయా అంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి. ఇదే సమయంలో ఏసీపీ విష్ణు మూర్తి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తమ జోలికి వస్తే తోలు తీస్తామంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో లక్షా 30 వేల మంది పోలీస్ కుటుంబాలను కించ పరిచేలా మాట్లాడితే బాగుండదంటూ హెచ్చరించారు.