పల్లా..పురంధేశ్వరిపై పొన్నం ఫైర్
ముందు మీ రాష్ట్రం చూసుకోండి
హైదరాబాద్ – మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిప్పులు చెరిగారు. ఏపీ టీడీపీ, బీజేపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు, దగ్గుబాటి పురంధేశ్వరిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఢోకా లేదన్నారు. ఇక్కడి పరిస్థితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ముందు మీ ఇల్లు చక్కదిద్దుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఎవరైనా సరే రూల్స్ కు విరుద్దంగా ప్రవర్తించినా, దాటినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యవహారంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయన అల్లు అర్జున్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం సాధించాడని సినీ సెలిబ్రిటీలు క్యూ కట్టారంటూ ప్రశ్నించారు.
అల్లు అర్జున్ కు ఏమైందని సందర్శించారని, పరామర్శించారంటూ ఎద్దేవా చేశారు. అంతే కాదు ఆయనకు ఏమైనా కాలు పోయిందా, కిడ్నీలు పాడయ్యాయా అంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి. ఇదే సమయంలో ఏసీపీ విష్ణు మూర్తి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తమ జోలికి వస్తే తోలు తీస్తామంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో లక్షా 30 వేల మంది పోలీస్ కుటుంబాలను కించ పరిచేలా మాట్లాడితే బాగుండదంటూ హెచ్చరించారు.