శ్రీలక్ష్మీ నరసింహ స్వామికి బంగారు కిరీటం
విరాళంగా అందించిన చెన్నై భక్తులు
తిరుపతి – అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం సమీపంలోని తరిగొండ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి బంగారు కిరీటం విరాళం ఇచ్చారు. చెన్నైకి చెందిన వసంత లక్ష్మి, ఆమె కుమార్తె మాధవి, అల్లుడు మనోహర్ లు రూ.27 లక్షల విలువైన 341 గ్రాముల బంగారు కిరీటాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కానుకగా సమర్పించారు.
ఈ ప్రసిద్ద ఆలయం తిరుపతి ప్రాంతానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది వాల్మీకిపురం. ఇక్కడికి సమీపంలోనే ఉంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ ముని బాల కుమార్, ఆలయ ఇన్స్పెక్టర్ డి కృష్ణమూర్తి, అసిస్టెంట్ నాగరాజు, ఆలయ అర్చకులు గోపాల భట్టార్, కృష్ణ ప్రసాద్ భట్టార్, గోకుల్, అనిల్ కుమార్ విరాళాన్ని స్వీకరించారు.
దర్శనానంతరం బంగారు కిరీటాన్ని విరాళంగా అందజేసిన దాతలకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్బంగా చెన్నై భక్తులను ప్రత్యేకంగా అభినందించారు శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు ఆలయ అధికారులు .