కడప ఎమ్మెల్యే వినూత్న నిరసన
నిల్చొని ఆందోళన చేపట్టిన మాధవీ రెడ్డి
కడప జిల్లా – కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి గందరగోళం చోటు చేసుకుంది . సోమవారం జరిగిన సమావేశంలో కేవలం మేయర్ సురేష్‌కు మాత్రమే కుర్చీ వేశారు కార్పొరేషన్ సిబ్బంది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి.
తనకు సీటు కేటాయించక పోవడాన్ని తప్పు పట్టారు. మేయర్ పోడియం వద్ద నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. కావాలని అవమానం చేశారంటూ వాపోయారు. ఇది ఏ మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఇలాగేనా వ్యవహరిస్తారా, మహిళను అని చూడకుండా కామెంట్స్ చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పవర్ కోల్పోయిన జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చెందిన వ్యక్తి. ఆ పార్టీకి చెందిన వారే ప్రస్తుతం కార్పొరేషన్ లో ఉన్నారు. దీంతో టీడీపీ వర్సెస్ వైసీపీగా మారి పోయింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. వీరిని కంట్రోల్ చేయలేక నానా తంటాలు పడాల్సి వచ్చింది.
గతంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి. దీనిపై తాను కోర్టుకు వెళతానని ప్రకటించారు.