నా కామెంట్స్ ను వెనక్కి తీసుకుంటున్నా
సహనం కోల్పోయా తప్పైంది మన్నించండి
హైదరాబాద్ – హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సహనం కోల్పోయి మాట్లాడానని మన్నించాలని కోరారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తాను నేషనల్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలియజేశారు. సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందో తెలియజేస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిన్న ప్రెస్‌మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
సంధ్య థియేటర్‌లో ఏం జరిగిందో తెలియజేస్తూ అక్కడి వీడియోలను విడుదల చేశారు. ఈ క్రమంలో మీడియా ఆనంద్‌ను కొన్ని విషయాలపై ప్రశ్నించగా, నేషనల్ మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తుందంటూ సీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో సీవీ ఆనంద్ ఇవాళ టార్గెట్ గా మారారు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. సోషల్ మీడియాలో ఇప్పుడు సీవీ ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు. దీనిపై జాతీయ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సీపీపై. ఎలా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తారంటూ ప్రశ్నించింది. ఒక బాధ్యత కలిగిన ఉన్నతాధికారి ఇలాగేనా మాట్లాడేది అంటూ పేర్కొన్నాయి.