వినోద్ కాంబ్లీకి తీవ్ర అస్వస్థత
థానే ఆస్పత్రిలో చేరిక
ముంబై – ప్రముఖ మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని థానే ఆస్పత్రిలో చేరారు. అవసరమైన పరీక్షలు చేపట్టారు. కాంబ్లీ వయసు 52 ఏళ్లు. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు టెండూల్కర్ తో కలిసి తమ క్రికెట్ గురువు రమాకాంత్ అచ్రేకర్ విగ్రహం ఆవిష్కరణలో పాల్గొన్నారు. చిన్ననాటి సంగతులను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో వినోద్ కాంబ్లీ వీల్ చైర్‌లో కనిపించాడు, ఇది అతని ఆరోగ్యంపై అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అతను రాత్రి ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, నిపుణుడైన వైద్యులచే నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఆందళనకరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కాంబ్లీ ఆరోగ్యం కుదుటగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కాంబ్లీ బీసీసీఐ నెల నెలా ఇచ్చే పెన్షన్ పై ఆధారపడి బతుకుతున్నారు. 1983 ప్రపంచ కప్ జట్టు సభ్యులతో సహా మరోసారి భారత మాజీ క్రికెటర్లు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. కాంబ్లీ వారి సహాయాన్ని కృతజ్ఞతతో అంగీకరించాడు.