అల్లు అర్జున్ పై ఎలాంటి కక్ష లేదు
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అల్లు అర్జున్ కేసుపై స్పందించారు. తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తన పట్ల కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శించడం లేదన్నారు. ఎలాంటి కక్ష లేదని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తమ పార్టీకి చెందిన వారేనని , తను తనకు మంచి మిత్రుడని చెప్పారు.
టీపీసీసీ చీఫ్ గౌడ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. పదే పదే తమ పార్టీని, ప్రభుత్వాన్ని ఈ కేసులోకి లాగవద్దని కోరారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. అయితే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వస్తున్నట్లు తనకు తెలియదన్నారు.
హీరోపై తమకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని మరోసారి స్పష్టం చేశారు మహేష్ కుమార్ గౌడ్. అలా ఎందుకుంటుందని అనుకుంటున్నారని ఎదురు ప్రశ్న వేశారు. తనకు రెడ్డి కాల్ చేశాడని, తాను వచ్చే లోపే తను వెళ్లి పోయాడని అన్నారు. పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ తో భేటీ అయ్యారని , ఆ సమయంలో కొప్పుల రాజు కూడా ఉన్నారని చెప్పారు.
ఆ మధ్యన వారి మధ్య ఏం జరిగిందనే విషయం తనకు తెలియదన్నారు. తెలుసుకుని చెబుతానని పేర్కొన్నారు టీపీసీసీ చీఫ్.