దీపా దాస్ మున్షీతో బన్నీ మామ భేటీ
టీపీసీసీ చీఫ్ తో ఘటనపై చర్చలు
హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారంపై చర్చించేందుకు స్వయంగా పిల్లను ఇచ్చిన మామ, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆయన గతంలో కేసీఆర్ పార్టీలో ఉన్నారు.
ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలకి జంప్ అయ్యారు. ఆ తర్వాత టికెట్ కోసం ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో పుష్ప-2 రిలీజ్ కావడం, అది బాక్సులు బద్దలు కొట్టడం సరి పోయింది. ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో ప్రిమీయర్ షో సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనలో రేవతి అనే మహిళ చని పోయింది. మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. దీంతో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఆ పై జైలుకు తరలించారు. కోర్టును ఆశ్రయించడంతో బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత మాటల యుద్దం కొనసాగింది.
చివరకు పోలీసులు సైతం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బన్నీకి. తోలు తీస్తామంటూ హెచ్చరించారు ఏసీపీ విష్ణు మూర్తి. దీంతో పిల్లను ఇచ్చిన మామ గత్యంతరం లేక ఇవాళ దీపా దాస్ తో కలిశారు. గోడు వెళ్ల బోసు కున్నారు. అక్కడి నుంచి పీసీసీ చీఫ్ గౌడ్ తో భేటీ అయ్యారు.
మరో వైపు మంత్రి సీతక్క సీరియస్ కామెంట్స్ చేశారు. స్మగ్లర్లకు జాతీయ అవార్డులు ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు.