BUSINESSTECHNOLOGY

అమెరికా ఏఐ స‌ల‌హాదారుగా శ్రీ‌రామ్ కృష్ణ‌న్

Share it with your family & friends

నియ‌మించిన అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్

అమెరికా – అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ భారతీయ, అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్‌ను ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కు సంబంధించి సీనియ‌ర్ వైట్ హౌస్ విధాన సలహాదారుగా నియమించారు. ఆయ‌న స్వ‌స్థ‌లం త‌మిళ‌నాడు. 21 ఏళ్ల వ‌య‌సులో 2005లో అమెరికాకు వెళ్లారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ విండోస్ అజూర్ టీమ్ వ్యవస్థాపక సభ్యుడిగా శ్రీ‌రామ్ కృష్ణ‌న్ సాధించిన విజయాలను ప్ర‌త్యేకంగా ప్రస్తావించారు ట్రంప్.

శ్రీ‌రామ్ కృష్ణన్ ప్రభుత్వం అంతటా ఏఐ విధానాన్ని రూపొందిస్తారని, సమన్వయం చేస్తారని అమెరికా అధ్య‌క్షుడు స్ప‌ష్టం చేశారు. శ్రీరామ్ కృష్ణన్ చెన్నైలో పుట్టారు. తమిళనాడులోని కాంచీపురం కట్టన్‌కులత్తూర్‌లోని ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేసారు.

సాంకేతిక ప్రపంచంలో శ్రీ‌రామ్ కృష్ణన్ ప్రయాణం 2005లో మైక్రోసాఫ్ట్‌లో ప్రారంభమైంది. ట్విట్టర్, యాహూ, ఫేస్‌బుక్ ,స్నాప్‌లలో ఉత్పత్తి బృందాలకు కూడా ఆయన నాయకత్వం వహించారు. ఫేస్‌బుక్ (ఇప్పుడు మెటా) , స్నాప్‌లో తన పదవీకాలంలో మొబైల్ ప్రకటన ఉత్పత్తులను అభివృద్ధి చేశాడు.

ట్రంప్ 2.0లో భాగమైన బిలియనీర్ ఎలోన్ మస్క్‌తో వృత్తి పరమైన బంధాన్ని పంచుకున్నాడు. శ్రీ‌రామ్ కృష్ణన్ 2022లో ట్విట్ట‌ర్ ప్ర‌స్తుతం ఎక్స్ గా మారింది. దానిని కొనుగోలు చేసిన దిగ్గ‌జ వ్యాపార‌వేత్త ఎలాన్ మ‌స్క్ తో క‌లిసి ప‌ని చేశారు.

ఫిబ్రవరి 2021లో వెంచర్ క్యాపిటల్ సంస్థ అయిన ఆండ్రీసెన్ హోరోవిట్జ్ లో కృష్ణన్ సాధారణ భాగస్వామి అయ్యారు. 2023 నాటికి, అతను కంపెనీ లండన్ కార్యాలయానికి నాయకత్వం వహించాడు. కృష్ణన్ నవంబర్ 2023లో సంస్థను విడిచిపెట్టారు. అంతే కాదు శ్రీ‌రామ్ కృష్ణ‌న్ త‌న భార్య ఆర్తీ రామ మూర్తితో క‌లిసి పోడ్ కాస్ట్ కూడా చేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *