నితీశ్ కుమార్ ను నమ్మలేం
జనసురక్ష చీఫ్ ప్రశాంత్ కిషోర్
జన్ సురక్షా పార్టీ అధినేత, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదన్నారు. అంతే కాదు ఆయన ఎటు వైపు ఉంటాడో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుందన్నారు. ఆయనను నమ్మి పోయిన వాళ్లు ఎవరూ బాగు పడిన దాఖలాలు లేవన్నారు ప్రశాంత్ కిషోర్.
నితీష్ కుమార్ మళ్లీ యూ టర్న్ తీసుకుంటారని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చారు జన సరుక్ష చీఫ్. అతను ఎటు వైపు ఉంటాడో తనకే సరిగా తెలియదన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన రాజకీయ ఊసర వెల్లి అని తీవ్ర స్థాయిలో కామెంట్ చేశారు ప్రశాంత్ కిషోర్.
కానీ ఇప్పుడు రాజకీయంగా, మానసికంగా, శారీరకంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదన్నారు . ప్రస్తుతం నితీవ్ కుమార్ లక్ష్యం వచ్చే కూడా సీఎంగా కొనసాగడమేనని పేర్కొన్నారు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులంటూ ఎవరూ ఉండదరని ఆ విషయం గ్రహిస్తే మంచిదన్నారు పీకే.