ఆర్జీవీ డబ్బులు చెల్లించక పోతే చర్యలు
ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్
అమరావతి – ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్నెట్ నుంచి దర్శకుడు రామ్గోపాల్ వర్మకు రూ.1 కోటి 15 లక్షలు అక్రమంగా చెల్లించారని ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
ఇందుకు సంబంధించి ఆర్జీవీకి నోటీసులు ఇచ్చామని చెప్పారు. 15 రోజుల గడువు ఇచ్చామని, ఆ లోపు ఇవ్వక పోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు జీవీ రెడ్డి. ప్రభుత్వం ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించామన్నారు. జగన్ రెడ్డి కేవలం ఆర్జీవీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపించారు జీవీ రెడ్డి. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు . నిరంతరం నీతులు బోధించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంక ఆలస్యం చేయకుండా తీసుకున్న డబ్బులను వెంటనే చెల్లించాలని , తన నిజాయితీని నిరూపించు కోవాలని సూచించారు.
మొత్తంగా మరోసారి రామ్ గోపాల్ వర్మ సంచలనంగా మారారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. తనను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది.