అబద్దాలకు కేరాఫ్ నరేంద్ర మోదీ
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మోదీకి ప్రచారం తప్ప ఆచరణలో శూన్యమేనని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర సందర్బంగా రాహుల్ ప్రసంగించారు. దేశంలో ధనిక, పేద అనే రెండు కులాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే పార్లమెంట్ లో తనంతకు తానుగా అతి పెద్ద ఓబీసీగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు రాహుల్ గాంధీ.
ఎవరైనా సరే చిన్న వారు, పెద్ద వారు అనే మనస్తత్వాన్ని మార్చు కోవాలని సూచించారు. ఓబీసీ అయినా, దళితుడైనా, గిరిజనుడైనా, వారిని లెక్క చేయకుండా వారికి ఆర్థిక, సామాజిక న్యాయం అందించలేమని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. బీసీల కుల గణన ఇప్పటి వరకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
దేశంలోని ప్రధాన వనరులను ధ్వంసం చేసే సంస్థలకు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టారంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ. ఇప్పటికే సగం దేశాన్ని అమ్మే పనిలో పడ్డారని, మరోసారి గనుక బీజేపీకి అధికారం గనుక వస్తే ఇక ఆత్మహత్యలు చేసుకోక తప్పదని హెచ్చరించారు.