సంధ్య టాకీస్ ఘటనలో 18 మందిపై కేసు
బన్నీతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు
హైదరాబాద్ – సంధ్య థియేటర్ తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. తాజాగా మరికొందరిని నిందితులుగా చేర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు బౌన్సర్లపై కూడా కేసు నమోదు చేశారు. మరో వైపు మూడున్నర గంటలకు పైగా అల్లు అర్జున్ ను ఏసీపీ పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. మొత్తం 18 మందిపై నమోదు చేశారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుల పేర్లను ప్రకటించారు ఏసీపీ. థియేటర్ యజమానులు ఏ1గా అగమాటి పెద రామి రెడ్డి, ఏ2గా అగమాటి చిన్న రామి రెడ్డి, ఏ3గా థియేటర్ పార్టనర్ ఎం. సందీప్, ఏ4గా సుమిత్ , ఏ5గా అగమాటి వినయ్ , ఏ6గా అశుతోష్ రెడ్డి, ఏ7గా రేణుకాదేవి, ఏ8గా అరుణా రెడ్డిని చేర్చినట్లు తెలిపారు.
ఏ9నగా థియేటర్ మేనేజర్ నాగరాజు, ఏ10గా లోయర్ బాల్కానీ ఇంఛార్జ్ విజయ్ చందర్, ఏ11గా పుష్ప హీరో అల్లు అర్జున్ , ఏ12గా బన్నీ పీఏ సంతోష్ , ఏ13గా బన్నీ మేనేజర్ శరత్ బన్నీ, ఏ14గా రమేష్ , ఏ15గా రాజు, ఏ16గా వినయ్ కుమార్ , ఏ17గా ఫర్వేజ్ బాడీగార్డ్ , ఏ18గా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలపై కేసు నమోదు చేశారు.