పీవీ సింధు నెట్టింట్లో వైరల్
ఘనంగా హైదరాబాద్ లో రిసెప్షన్
హైదరాబాద్ – ప్రముఖ ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పెళ్లి చేసుకుంది. అత్యంత భారీ ఖర్చుతో వివాహ వేడుకలు జరిగాయి. ప్రత్యేకించి రాజస్థాన్ లోని ఓ ఖరీదైన దీవిలో పెళ్లి అంగరంగ వైభవోపేతంగా జరిగింది. ఇక హైదరాబాద్ లో జరిగిన రిసెప్షన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు. సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపారవేత్తలు హాజరై ఆశీర్వదించారు.
ఇదిలా ఉండగా పీవీ సింధు తన వివాహ, రిసెప్షన్ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను ప్రత్యేకంగా సామాజిక మాధ్యమాలు ఫేస్ బుక్, ట్విట్టర్ ఎక్స్ , లింక్డ్ ఇన్, వాట్సాప్ , యూట్యూబ్ , తదితర వాటిల్లో షేర్ చేసింది. ఇక ఇన్ స్టా గ్రామ్ లో ఎంత మంది ఎక్కువగా చూసినా లేదా లైక్, కామెంట్స్ చేసినా డబ్బులు వస్తాయి. దీంతో భారత్ కు చెందిన సెలిబ్రిటీలంతా తమకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను తెగ షేర్ చేస్తూ పోతున్నారు.
కానీ వారికి తెలియడం లేదు తమ వ్యక్తిగత ఫోటోలు బహిరంగంగా ఎలా దుర్వినియోగం అవుతాయని. ఇది పక్కన పెడితే నిన్నటి దాకా మైదానంలో దుమ్ము రేపిన పీవీ సింధు ఇప్పుడు వ్యాపారవేత్త దత్తుతో పెళ్లి పీటలు ఎక్కింది. ఇక హానీమూన్ కోసం ఎక్కడనేది ఇంకా సమాచారం అందలేదు.