పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన తారక్
తల్లి ఆరోపణలతో దెబ్బకు దిగొచ్చిన హీరో
హైదరాబాద్ – నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన హీరోలంతా ఇప్పుడు సర్దుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ ఉక్కు పాదం మోపడంతో సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా బిక్కు బిక్కుమంటున్నారు.
నిన్నటి దాకా తమకు ఎదురే లేదంటూ విర్రవీగిన వీరికి ఏసీపీ విష్ణు మూర్తి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నటుడు బన్నీకి. దీంతో కిక్కురు మనడం లేదు బన్నీ తండ్రి అల్లు అరవింద్. సినీ రంగం అంటేనే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిదే ఆధిపత్యం.
తాజాగా అల్లు అర్జున్ ఘటన మరిచి పోక ముందే జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం తెర పైకి వచ్చింది. తన కుమారుడి ఆరోగ్యం గురించి తారక్ హామీ ఇచ్చి పట్టించు కోవడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు బాధితుడి తల్లి .
దెబ్బకు దిగి వచ్చాడు తారక్. వెంటనే బిల్లులు క్లియర్ చేయాల్సిందిగా తన టీమ్ ను ఆదేశించాడు. క్యాన్సర్‌తో బాధపడుతూ చెన్నై అపోలోలో చికిత్స పొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఆసుపత్రి పెండింగ్ బిల్లు క్లియర్ చేసింది .