పవన్ కళ్యాణ్ ఆదేశం రోడ్డుకు మోక్షం
తళ తళ లాడుతున్న తారు రోడ్డు
అమారవతి – పాలనా పరంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ నియోజకవర్గం పరిధిలో హుకుంపేట మండలం గూడా రోడ్డు నుండి సంతబయలు వరకు మర్రిపుట్టు గ్రామం మీదుగా 2.00 కిలోమీటర్ల మేర రూ 90.50 లక్షల అంచనాతో తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు.
గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఈ రోడ్డు నిర్మాణం గురించి పట్టించు కోలేదు. ఇటీవల గిరిజన ప్రాంతాలలో పర్యటించారు పవన్ కళ్యాణ్. గిరి పుత్రులతో స్వయంగా మాట్లాడారు. నెలలో రెండుసార్లు ఇక్కడికి వస్తానని ప్రకటించారు. తమ కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ది కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణ నీటి పారుదల శాఖలకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించేలా చేశారు .
ఇందు కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అత్యధికంగా నిధులు కేటాయించేలా చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ఆయన సీఎం చంద్రబాబు నాయుడును ఒప్పించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తాగు నీరు, రోడ్ల నిర్మాణంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నే ఇవాళ రోడ్డు ను యుద్ద ప్రాతిపదికన చేపట్టడం పట్ల చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు . పవన్ కు ధన్యవాదాలు తెలిపారు.