బాల్క సుమన్ పై కేసు నమోదు
రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలి
హైదరాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై అనుచిత కామెంట్స్ చేసినందుకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డిని రండ గాడు అన్నందుకు ఐపీసీ 294-బి, 504,506 సెక్షన్ల కింద మాజీ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.
చెప్పుతో కొట్టాలని ఉంది కానీ తనకు సంస్కారం అడ్డు వస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ బాల్క సుమన్. రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పై , ప్రజా ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు.
తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో వెంటనే ఎక్కడ ఉన్నా సరే మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు . ఇలాంటి హద్దు మీరిన భాష మాట్లాడకుండా చూడాలని సూచించారు.
ఇంకోసారి నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు.